etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 15, 2019

ఆత్మహత్య చేసుకోమంటారా ..! వద్దా ..! అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోలింగ్ పెట్టి మరీ ….?

ఇన్‌స్టాగ్రామ్‌లో పోలింగ్ నిర్వహించుకుని మరీ ఓ అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాదం మలేషియాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సారవాక్‌కు చెందిన 16ఏళ్ల అమ్మాయి.. ఇన్‌స్టాలో ఓ పోల్ నిర్వహించింది. ‘‘ఇది చాలా ఇంపార్టెంట్. ‘డీ/ఎల్‌’లో ఎంచుకోవడంలో నాకు సహకరించండి’’ అనేది పోల్ సారాంశం. ఇలా పెట్టిన కొద్ది గంటల్లోనే ఆమె భవంతిపై నుంచి దూకి చనిపోయింది. మే 13న ఈ దుర్ఘటన జరిగింది. డీ/ఎల్ అంటే మరణించడం/జీవించి ఉండటం అని పోలీసుల విచారణలో తేలింది. ఆమె నిర్వహించిన పోలింగ్‌లో 69శాతం మంది ఆమె మరణానికి ఓటేశారు. దీంతో ఆమె చావడానికే నిర్ణయించుకుని ఆత్మహత్యకు పాల్పడిందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. మలేషియా చట్టాల ప్రకారం మైనర్లు ఆత్మహత్యకు పాల్పడితే.. జీవితఖైతు లేదా 20 ఏళ్లు జైలు శిక్ష విధిస్తారు. ఇంత కఠిన చట్టాలున్నా.. ఆత్మహత్యకు పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. యువతి ఆత్మహత్యపై మరింత విచారణ జరగాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

The post ఆత్మహత్య చేసుకోమంటారా ..! వద్దా ..! అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోలింగ్ పెట్టి మరీ ….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2HmKXNV

No comments:

Post a Comment