etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 1, 2019

హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను గుర్తించినట్టు భారత సైన్యం ఫొటోలు పోస్టు …!

యతి.. ఇప్పుడీ పదం దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను గుర్తించినట్టు భారత సైన్యం ఫొటోలు పోస్టు చేసిన తర్వాత సర్వత్ర ఆసక్తి నెలకొంది. పురాణాల్లో వినడం, అప్పుడప్పుడు సినిమాల్లో చూడడం తప్ప వీటిని ప్రత్యక్షంగా చూసిన వారెవరూ లేరు. అసలు భూమిపై మంచుమనిషి ఉన్నాడా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఏప్రిల్ 9న మకలు బేస్ క్యాంప్ సమీపంలో సాహస యాత్రకు వెళ్లిన భారత సైనికుల బృందం 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పుతో ఉన్న ఈ పాదముద్రలు కనిపించాయి. దీంతో హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు మనిషి సంచారం అంశం మరోమారు చర్చనీయాంశమైంది.

నేపాల్‌లో యతి

నేపాలీ జానపదాల్లోనూ యతి ప్రస్తావన ఉంది. యతిని వారు ‘భయంకరంగా ఉండే మంచు మనిషి’గా అభివర్ణించేవారు. సాధారణ మనిషి కంటే చాలా ఎత్తుగా, బలంగా యతి ఉండేదని నమ్మేవారు. హిమాలయాలు, సైబీరియా, మధ్య, తూర్పు ఆసియా ప్రాంతాల్లో ఇవి నివసించేవని చెబుతుంటారు. 19వ శతాబ్దంలో యతిని మంచుమనిషిలా భావించేవారు. కొన్ని తెగలు యతిని ప్రత్యేకంగా పూజించేవి. పెద్ద రాయిని యతి ఆయుధంలా ఉపయోగించేదని, పెద్దగా అరిచేదని చెప్పేవారు. శరీరం నిండా పెద్దపెద్ద వెంట్రుకలతో ఉండే ఈ భారీ జీవి హిమాలయ పర్వతసానువుల్లో తిరుగాడేదని, ఇవి పలుమార్లు పర్వాతారోహకుల కంట పడేవని గతంలో కథనాలు వచ్చాయి. 1920 నుంచి నేపాల్‌లో అడపాదడపా ఇవి కనిపిస్తూనే ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. సంవత్సరాలుగా వీటిపై కథనాలు వస్తున్నా వాటికి సంబంధించిన చిత్రాలను మాత్రం ఎవరూ పట్టుకోలేకపోయారు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు

హిమాలయ ప్రజలు వీటిని యతి లేదంటే మే-తే అని పిలుస్తారు. టిబెటన్ భాషలో యతి అంటే ‘మిచే’ అని అర్థం. అంటే ‘మనిషిలాంటి ఎలుగుబంటి’ అని అర్థం. అలాగే, ‘డిజు-తే’ అని కూడా పిలిచేవారు. అంటే ‘హిమాలయన్ బ్రైన్ బేర్’ అని అర్థం. ‘మిగోయి’ అనే పేరు కూడా ఉంది. అంటే ‘ఆటవికుడు’ అని పిలిచేవారు. నేపాలీలు ‘బన్‌ మంచి’ అనేవారు. అంటే ‘అడవి మనిషి’ అని అర్థం.

కార్టూన్ షోలో..

యతిని తొలిసారి పాపులర్ కార్టూన్ షో ‘ది అడ్వంచర్స్ ఆఫ్ టింటిన్’ లో చూపించారు. ఈ షోలో దానిని దయగల జీవిగా చూపించారు. 2016లో ‘హంట్ ఫర్ ది యతి’ పేరుతో ట్రావెల్ చానల్ ప్రత్యేకంగా నాలుగు పార్టుల ఎపిసోడ్ చేసింది.


సైన్స్ పరిశోధనల్లో యతి

శాస్త్రవేత్తల పరిశోధనల్లోనూ యతికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగుచూశాయి. ఒకప్పుడు యతి ఉన్న మాట వాస్తవమేనన్న అంగీకారానికి శాస్త్రవేత్తలు కూడా వచ్చారు. 2017లో అంతర్జాతీయ శాస్త్రవేత్తలు కొందరు యతికి ఉనికికి సంబంధించి కొన్ని నమూనాలు సేకరించారు. హిమాలయ పర్వత సానువుల్లో లభ్యమైన వీటిని ఆ తర్వాత ఎలుగుబంటివిగా తేల్చారు. 2008లో అమెరికాకు చెందిన ఇద్దరు వ్యక్తులు సగం మనిషి, సగం కోతితో ఉన్న జీవికి సంబంధించి కొన్ని నమూనాలు సేకరించారు. అయితే అవి కూడా యతికి సంబంధించినవి కావని తేలింది. మళ్లీ ఇన్నాళ్లకు యతి పాదముద్రలు కనిపించడం ప్రపంచవ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశమైంది.

The post హిమాలయ పర్వత శ్రేణుల్లో యతి అడుగుజాడలను గుర్తించినట్టు భారత సైన్యం ఫొటోలు పోస్టు …! appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2PGfpEY

No comments:

Post a Comment