etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 1, 2019

వివాదంలో నిత్యమినన్…చిత్ర పరిశ్రమ నుంచి బ్యాన్….?

పాత్రలు మాత్రమే కనిపించేలా నటించే విలక్షణ నటి నిత్యామీనన్‌. పాత్రలు పోషించడంలోనే కాదు వాటిని ఎంచుకోవడంలోనూ నిత్యది డిఫరెంట్‌ స్టైల్‌. కంటెంట్‌కు ప్రాధాన్యం ఉంటే చిన్న పాత్రలైనా సరే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తారు. వ్యక్తిగతంగా కూడా తనకు నచ్చినట్లే ఉంటారు నిత్యా. దాంతో చాలామంది ఆమెకు పొగరు అని కూడా అనుకుంటారు. తాజాగా నిత్యా మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను కలవడానికి వచ్చిన నిర్మాతలతో నిత్యా మాట్లాడలేదని.. చాలా పొగరుగా ప్రవర్తించిందనే ప్రచారం జరుగుతుంది. ఆమెని బ్యాన్‌ చేయాలని సదరు నిర్మాతలు భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు కూడా ప్రచురితమయ్యాయి.

తాజాగా ఓ టీవీ షో ఇంటర్వ్యూలో దీనిపై స్పందించిన నిత్యా.. ‘వారు(నిర్మాతలు) ముందుగా నాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వచ్చి.. నన్ను కలవాలని చెప్పారు. అప్పుడు నేను చాలా బాధలో ఉన్నాను. ఎవరితో మాట్లాడలని కూడా అనిపించలేదు. ఆ సమయంలో మా అమ్మకు క్యాన్సర్‌ అని తెలిసింది. అది కూడా చాలా అడ్వాన్స్డ్‌ స్టేజ్‌లో ఉంది. షూటింగ్‌ సమయంలో కూడా దీని గురించి ఆలోచిస్తే నాకు ఏడుపు వచ్చేది. వెంటనే కార్‌వాన్‌లోకి వెళ్లి మా అమ్మ గురించి తల్చుకుని బాధపడేదాన్ని. అంతేకాక అదే సమయంలో నేను మైగ్రేన్‌తో బాధపడుతున్నాను. అప్పుడు ఎవరితో మాట్లాడలని అనిపించలేద’న్నారు.

‘కానీ ఇవేవి తెలీకుండా ఆ నిర్మాతలు నాకు చాలా పొగరని.. యాటిట్యూడ్‌ చూపిస్తాను అన్నారు. కానీ ఇలాంటి వాటిని నేను పెద్దగా పట్టించుకోను. నా పనేదో నేను చూసుకుంటాన’ని తెలిపారు. నిత్యా సమాధానం అభిమానలు మనసు గెల్చుకుంది. ఎప్పుడు మీరు ఇంతే ధైర్యంగా ఉండాలని అభినందిస్తున్నారు అభిమానులు. ప్రస్తుతం నిత్యా తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్‌ ‘ఐరన్‌ లేడీ’లో నటిస్తున్నారు. ఆమె చేతిలో ‘కొలంబి’, ‘సైకో’, ‘మిషన్‌ మంగళ్‌’ తదితర చిత్రాలు ఉన్నాయి. తెలుగులో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌లో కూడా నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

The post వివాదంలో నిత్యమినన్…చిత్ర పరిశ్రమ నుంచి బ్యాన్….? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2vEByL3

No comments:

Post a Comment