etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, May 18, 2019

ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయే : లగడపాటి

తెలంగాణలో టీఆర్ఎస్, ఏపీలో టీడీపీ గెలుస్తుందని పరోక్షంగా చెప్పారు ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి. సీట్లతో సహా పూర్తి స్థాయి ఫలితాలను ఆదివారం సాయంత్రం ప్రకటిస్తానని అన్నారాయన. తెలంగాణలో బడ్జెట్ బాగుంది కనుక ప్రజలు కారు ప్రయాణం కోరుకున్నారని పరోక్షంగా మనసులో మాట బయటపెట్టారాయన. అలాగే ఏపీ ప్రజలు లోటు బడ్జెట్ లో ఉన్నారు కనుక సైకిల్ ప్రయణం కోరుకున్నారని అన్నారు. అంతేకాదు ఏపీలో హంగ్ వచ్చే పరిస్థితే లేదని కుండబద్ధలు కొట్టేశారాయన. ప్రజల తీర్పు స్పష్టంగా ఉంటుందన్నారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఏర్పాడుతుందని క్లారిటీ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ ఈ సారి అసెంబ్లీలోకి అడుగుపెట్టడం ఖాయమన్నారు.

అయితే..మెగాస్టర్ తమ్ముడికి మెగాస్టర్ కంటే తక్కువ సీట్లే వస్తాయని అన్నారు.ఏపీలో హంగ్ కు అవకాశమే లేదన్న లగడపాటి..కేంద్రంలో మాత్రం ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని అన్నారు. ఇప్పటికే రెండు ఫ్రంట్ లు ఉన్నాయని..మరో రెండు ఫ్రంట్ ల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.

The post ఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయే : లగడపాటి appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2YAmLgI

No comments:

Post a Comment