పాకిస్థాన్‌కు చెందిన యువతి పన్నిన వలలో చిక్కిన ఒక భారత జవాను, సైనిక రహస్యాలను ఆమెకు, తద్వారా పాక్ ఉగ్రవాదులకు అందించాడు. ఆ సమాచారంతోనే ఉగ్రవాదులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడి, 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. మధ్యప్రదేశ్ ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్), కేంద్ర నిఘా సంస్థలు చేసిన దర్యాప్తులో ఈ సంచలన విషయం వెలుగుచూసింది. ఇండోర్ సమీపంలోని మోహో పట్టణంలో బిహార్ రెజిమెంట్‌లో నాయక్ క్లర్కుగా అవినాశ్ కుమార్ (25) అనే యువకుడు పనిచేసేవాడు. 2018లో అతడిని అసోంకు బదిలీ చేశారు. ఆ సమయంలో అతడికి వాట్సా్‌పలో ఓ పాకిస్థాన్ యువతితో పరిచయం ఏర్పడింది. అందచందాలతో అవినాశ్‌ను వలలో వేసుకున్న ఆమె.. సైనిక రహస్యాలను అతడి వద్ద కూపీ లాగి ఉగ్రవాదులకు చేరవేసేది. ఆ సమాచారంతో పక్కా ప్రణాళిక రచించుకున్న ముష్కరులు పుల్వామాలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. అవినాశ్ బ్యాంకు ఖాతాలో పాకిస్థాన్ నుంచి రూ.50 వేలు నగదు కూడా జమ అయిందని దర్యాప్తులో తేలింది. భోపాల్‌లోని ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. అవినాశ్ తండ్రి కూడా జవానే కావడం గమనార్హం.
The post పుల్వామా ఉగ్రదాడి వెనుక పాక్ యువతి.. ఎలాంటి ప్లాన్ వేసిందంటే..ఆ సమాచారంతోనే పుల్వామా ఉగ్రదాడి…! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2HvprFu
No comments:
Post a Comment