గంగి గోవు పాలు గరిటెడైనా చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!”
అనే పద్యం చిన్నప్పుడు స్కూల్‌లో చదువుకున్నాం గుర్తుంది కదా. దీని అర్థం కూడా చాలా మందికి తెలుసు. ”మంచి ఆవు పాలు గరిటెడు అయినా చాలు, కానీ కడివెడు (కుండ) గాడిద పాలు ఉన్నా అవి పనికి రావు కదా, భక్తితో పెట్టే తిండి కొంచెం అయినా సరిపోతుంది..” అని ఈ పద్యానికి అర్థం. అయితే ఇందులో గాడిద పాలు పనికి రావనే మాట ఉంది, కానీ నిజానికి చూస్తే గాడిద పాలే ఆవు పాల కన్నా మేలైనవట. ఇది మేం చెబుతున్నది కాదు, సైంటిస్టులు చేసిన ప్రయోగాలే చెబుతున్నాయి.
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ వారి కరెంట్ ఫార్మాసూటికల్ డిజైన్ కథనంలో, జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ కథనంలో గాడిద పాల గురించిన విషయాలను వివరించారు. గాడిద పాలపై సైంటిస్టులు చేసిన ప్రయోగాలు ఏం చెబుతున్నాయంటే… ఆవు పాల కన్నా గాడిద పాలలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుందట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… గాడిద పాలు ఇంచు మించు Human Milk అంటే తల్లిపాల అంత శ్రేష్టమైనవట. ఈ క్రమంలోనే గాడిద పాలతో ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో కూడా వారు తెలుసుకున్నారు. గాడిద పాలను తాగడం వల్ల ఆస్తమా, దగ్గు, జలుబు, కిడ్నీలో రాళ్లు, జాండిస్ వంటి సమస్యలు పోతాయట. కీళ్ల నొప్పులు తగ్గుతాయట.
అయితే ఆవు, గేదెల పాలతో పోలిస్తే మాత్రం గాడిద పాల ధర చాలా ఎక్కువ. ఎంత అంటే 15 ఎంఎల్ గాడిద పాల ధర రూ.50 వరకు పలుకుతుంది. అంటే సాధారణంగా మనం కొనే లీటర్ పాల రేటు ఇది. ఈ క్రమంలో లీటర్ గాడిద పాల ధర రూ.3,300 వరకు ఉంటుందన్నమాట. ఇక గాడిదలు ఆవులు, గేదెల్లా పాలు ఇవ్వవు. ఒక్కో గాడిద కేవలం 250 ఎంఎల్ మోతాదులో మాత్రమే పాలను ఇస్తుంది. అది కూడా ఏడాదిలో కేవలం 7 నుంచి 8 నెలలు మాత్రమే. ఆ సమయం అయిందంటే ఇక మరో 3 ఏళ్ల పాటు వేచి చూడాలి. ఆ తరువాతే గాడిద పిల్లల్ని పెట్టి మళ్లీ పాలు ఇస్తుంది. ఏది ఏమైనా గాడిద పాలు మాత్రం విలువైనవే అనే విషయం ఇప్పుడు తెలిసింది కదా..!
The post గాడిద పాలు నిజంగా మంచివేనా..? వాటిని తాగవచ్చో, లేదో తెలుసా..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2vvQScB


No comments:
Post a Comment