ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారే లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు విశాఖలో కలకలం రేపుతున్నాయి. తన సోదరిని మోసం చేసిన యువడికిపై చేసిన ఫిర్యాదుపై వాకబు చేసిన బాధితురాలి సోదరితో.. ఎంవీపీ సీఐ సన్యాసి నాయుడు ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడడారు. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. విమర్శలు వెల్లువెత్తడంతో ఈ ఘటనపై సీరియస్ అయిన జిల్లా ఎస్పీ సీఐ సన్యాసి నాయుడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఫిర్యాదు ఇచ్చిన తరువాత సదరు యువకుడు విజయభాస్కర్‌పై చర్యలు తీసుకోకపోగా..తనకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడారని బాధితురాలి సోదరి ఆరోపిస్తోంది. మీనాక్షికి సీఐ సన్యాసినాయుడు ఫోన్‌చేసి..ఎక్కడ ఉంటున్నారు?,ఏం చదువుతున్నావు? ఏ టైమ్‌లో ఫ్రీగా ఉంటావు? బీచ్‌కి ఎప్పుడు వస్తావు? ఇద్దరం ఒకే కేస్ట్ కదా.. అంటూ సీఐ లైంగికంగా వేధించాడు. ఇందుకు సంబంధించిన ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. అందులో ఏముందో ఓసారి విందాం. బాధితురాలి సోదారిని వేధించాననే ఆరోపణలు అవాస్తవమన్నారు సీఐ సన్యాసినాయుడు. ఫోన్లో తాను అసభ్యకరంగా మాట్లాడలేదని చెప్పారు.
The post మీ అక్క కంటే నువ్వు చాలా అందంగా ఉన్నావు .. బీచ్‌కి వస్తావా? అంటూ….! appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2PEhwZZ
No comments:
Post a Comment