etechlooks

Daily Latest news Channel

Breaking

Saturday, May 18, 2019

ఈ చిన్నారి వీడియో చూసి ఆనంద్‌మహింద్రానే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. మీరు చుడండి.

పిల్లలు అల్లరి చేసినప్పుడు.. పిల్లలు కాదు బాబోయ్‌ పిడుగులు..! అని విసుక్కుంటాం. వారు ఏదైనా పని అద్భుతంగా చేసినప్పుడు పిల్లలు కాదు చిచ్చరపిడుగులు అని అంటుంటాం. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మహింద్రా అండ్‌ మహింద్రా కంపెనీ యజమాని ఆనంద్‌మహింద్రా ఓ వీడియో చూసి సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. వావ్‌ అంటూ ఒకింత ఆశ్చర్యంతో కూడిన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఫుట్‌బాల్‌తో సకల విన్యాసాలు చేస్తున్న చిన్నారి జట్టుని చూసి తొలుత అమ్మాయి అని భావించానని.. కానీ, అబ్బాయి అని తెలిసిందని చెప్పుకొచ్చారు. నాలుగేళ్ల ఈ ఇరానీయన్‌ కుర్రాడి విన్యాసాలు అద్భుతం అంటూ ఆనంద్‌ ఆయన చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇక మైదానంలో ప్రత్యర్థి అంచనాలకు అందకుండా.. పాదరసంలా కదులుతూ ఈ బుడతడు గోల్‌ చేసిన తీరు, కాలితో బంతిని అలా ఓ 30 సెకన్ల పాటు గాల్లోనే ఉంచడం.. చూడకుండా బాస్కెట్‌లో బంతిని వేయడం, నెట్స్‌లో చురుకైన సాధన అతని ప్రతిభకు నిదర్శనం. ‘భవిష్యత్‌లో గొప్ప ఫుట్‌బాలర్‌ అవుతావ్‌’ అంటూ.. నెటిజన్లు చిన్నారిపై ప్రశంసలజల్లు కురిపిస్తున్నారు.

The post ఈ చిన్నారి వీడియో చూసి ఆనంద్‌మహింద్రానే సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. మీరు చుడండి. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2LV8l9m

No comments:

Post a Comment