రామ్ చరణ్ – సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల రూపాయిలు వసూలు చేసి బాహుబలి సిరీస్ తర్వాత స్తానం లో నిల్చుంది..ఇది ఒక్క చరిత్ర..భవిష్యత్తు లో ఏ టాప్ హీరో సినిమా హిట్ అయినా నాన్ బాహుబలి రికార్డు అని చెప్పుకోడం తో పాటు..నాన్ రంగస్థలం రికార్డు అని చెప్పుకావాల్సిన అనితర సాధ్యమైన రికార్డులు సృష్టించాడు రామ్ చరణ్..అంతటి ఘన విజయం సాధించిన తర్వాత రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం భారీ అంచనాలతో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ తో సంబంధం లేకుండా రికార్డులు సృష్టించిన సంగతి మన అందరికి తెలిసిందే ..తల పండిన సినీ పండితులు సైతం వినయ విధేయ రామ బాక్స్ ఆఫీస్ విధ్వంసం చూసి ఆశ్చర్యపోయారు ..గతం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప ఎవ్వరు ప్లాప్ టాక్ రికార్డు వసూళ్లను రాబట్టలేదు..దీన్ని బట్టే చెప్పొచ్చు బాక్స్ ఆఫీస్ దగ్గర బాబాయి – అబ్బాయి స్టామినా ఎలాంటిదో.
ఇక అసలు విషయం లోకి వెళ్ళితే వినయ విధేయ రామ తర్వాత రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వం లో వస్తున్నా #RRR మూవీ లో నటిస్తున్న సంగతి మన అందరికి తెలిసందే..ఈ చిత్రం లో రామ్ చరణ్ తో పాటు ఎన్టీఆర్ కూడా నటిస్తున్నారు..ఇటీవలే ఏ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది ..40 రోజుల పాటు విరామం లేకుండా జరిగిన ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ -ఎన్టీఆర్ మధ్య ఒక్క భారీ ఫైట్ సీన్ ని తెరకేకించారు..ఈ ఫైట్ సీన్ కనివిని ఎరుగని రీతిలో ఉండబోతుంది అంట..ఇది ఇలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ #RRR తర్వాత చెయ్యబొయ్యే సినిమాలు కూడా ఇప్పటికే ఖారారు చేస్తునట్టు సమాచారం..ఒక్కపక్క సై రా నరసింహ రెడ్డి చిత్రం తో నిర్మాణ బాధ్యతలు చేపడుతూనే మరోపక్క తన సినిమాలు కూడా ప్లాన్ చేసుకుంటున్నాడు రామ్ చరణ్
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ #RRR తర్వాత మల్లి సుకుమార్ తో జతకట్టబోతున్నారు అని ఫీల్ నగర్ లో ఈ వార్త చక్కర్లు కొడుతుంది..ఇప్పటికే రామ్ చరణ్ కోసం ఒక్క అద్భుతమైన స్టోరీ లైన్ సిద్ధం చేసారు అని..దానికి రామ్ చరణ్ కూడా పచ్చ జెండా ఊపేసారు అని చెప్పుకుంటున్నారు..ఒక్కవేల ఇదే కనుక నిజం అయితే మెగా అభిమానులకి పండుగ లాంటి వార్త అనే చెప్పొచ్చు..ఇప్పటికే రంగస్థలం చిత్రం తో సరికొత్త బెంచ్ మార్కులు సృష్టించిన ఈ కాంబినేషన్ మల్లి తెరపైకి వస్తే ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..మరి ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ తెలియాలి అంటే మరికొద్ది రోజులు వేచి చూడక తప్పదు..ప్రస్తుతం సుకుమార్ మహేష్ బాబు తో సినిమా చెయ్యడానికి సిద్ధం అవుతున్నారు.ఈ చిత్రం పూర్తి అయినా తర్వాత రామ్ చరణ్ తో చేసే అవకాశం ఉంది
The post మెగా అభిమానులకి పూనకాలు రప్పించే వార్త..మరో చరిత్రకి శ్రీకారం appeared first on Tollywood Superstar.
from Tollywood Superstar http://bit.ly/30kwqJS
via IFTTT

No comments:
Post a Comment