అనాథ బాలికలను పెంచుకుంటామంటూ దత్తత తీసుకుంటారు. తమ పిల్లలేనంటే తప్పుడు పత్రాలు సృష్టిస్తారు. యుక్తవయసులోకి రాగానే వ్యభిచార కూపంలోకి దింపుతారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో దారుణాలివి. జిల్లా ఎస్పీ సింధుశర్మ ఆదేశాలతో ధర్మపురిలో వ్యభిచార గృహాలపై జరిగినదాడుల్లో కొత్తకొత్త విషయాలు వెలుగుచూశాయి. సోదాల్లో భాగంగా ఐదుగురు బాలికలను గుర్తించారు పోలీసులు. ఇందులో ఏడేళ్లు వయసున్న బాలిక కూడా ఉంది. మరో బాలికకు పదేళ్లు కాగా, 12 ఏళ్ల వయసున్న బాలికలు ఇద్దరున్నారు. 17 ఏళ్ల యువతిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార ముఠా వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి మరీ దందాను సాగిస్తున్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుకుంటున్నఈ బాలికలను వ్యభిచార గృహాల నిర్వాహకులు వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చినట్టు గుర్తించారు. తప్పుడు వివరాలతో ఆధార్ కార్డులు సృష్టించి, తమ పిల్లలుగానే పెంచుకుంటున్నారు. వ్యభిచార నిర్వాహకులు సంజీవ్, కమల, దీప, పద్మ, అశ్విని, కల్పనలను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించగా నిజాలు వెలుగుచూశాయి. వీరిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి.. తమ ఇళ్లలో ఉంచుకుని ఈ దందా చేయిస్తున్నారు. తమ పిల్లలుగానే చెబుతూ అమాయకుల జీవితాలతో ఆడుకుంటున్నారు. అనాథ పిల్లలను లక్ష్యంగా చేసుకుని.. పెంచుకుంటామనే పేరుతో ధర్మపురికి తీసుకొచ్చి పాపపు పనులు చేయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. 10 వేల నుంచి 20 వేలకు కొనుగోలు చేసి పాఠశాల, కళాశాలలో చదివిపిస్తామంటూ ఈ ప్రాంతానికి తీసుకువచ్చి, పెంచి, పెద్ద అయిన తర్వాత వ్యభిచారంలోకి దింపుతున్నారు.
పోలీసుల అదుపులో ఉన్న బాలికలను కరీంనగర్‌లోని స్వధార్ హోమ్‌కు తరలించనున్నారు. అక్కడ బాలికలకు డీఎన్‌ఏ టెస్టులతో పాటు ఇతర టెస్టులను నిర్వహించి వారి తల్లిదండ్రులను గుర్తించే ప్రయత్నాలు చేస్తామని పోలీసులు తెలిపారు. వారు ఏ ప్రాంతానికి చెందినవారు. వ్యభిచార గృహాలకు ఎలా చేరారు, ఎంతకాలం నుంచి అక్కడ ఉంటున్నారు తదితరఅంశాలపై దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు గుర్తించిన వారిలో నలుగురు అనాథలని తెలుస్తోంది. దశాబ్దాలుగా ఇక్కడ వ్యభిచార దందా సాగుతోంది. జగిత్యాల, ధర్మపురిలో జాతీయ రహదారిని ఆనుకుని వ్యభిచార గృహాలు పెద్దెత్తున వెలిశాయి. ప్రఖ్యాతిగాంచిన ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి క్షేత్ర సమీపంలో దాదాపు 20 నుంచి 25 మంది మహిళలు చాలా కాలంగా ఈ దందా సాగిస్తున్నారని పోలీసులు విచారణలో తేలింది. భక్తులు కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులున్నాయి. అడపాదడపా పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ దందాకు అడ్డుకట్ట పడడం లేదు.
The post వ్యభిచార గృహాలపై దాడులు.. సంచలన విషయాలు వెలుగులోకి……? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2vvpUC7


No comments:
Post a Comment