వెల్లుల్లి. సహజ ఔషధ ఆహారపదార్థంగా మన పెద్దలు చెబుతారు. ఎందుకంటే వెల్లుల్లి శరీరానికి చేసే మేలు అటువంటిది. మన శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు, ఒళ్ళు నొప్పులు ఉన్నా వెల్లుల్లి వాటిని నివారించడానికి సహాయపడుతుంది. రోగాన్ని నయం చేసే మంచి ఔషధంగా వెల్లుల్లి పనిచేస్తుంది. వెల్లుల్లిని కేవలం మనం ఆహారంలో రుచి మరియు సువాసనకోసమే కాదు మన ఆరోగ్యం, రోగ నిరోధక శక్తి పెంపొందించుకోవడానికి ఉపయోగిస్తాం. వెల్లుల్లి తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం…
1. వెల్లుల్లి ఒళ్ళు నొప్పులు తగ్గించేస్తుంది:
కొందరి చెవుల నుండి చీము బయటికి రావడం వల్ల వారి చెవి నుండి దుర్గంధం వస్తుంటుంది. అలాంటి వాళ్ళు వెల్లుల్లిని చెవి దగ్గర పెట్టుకుంటే చెవినుండి వచ్చే దుర్వాసన కంట్రోల్ అవుతుంది. అంతేకాదు. ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నోళ్ళు వెల్లుల్లిని చెవిలో పెట్టుకోవడం వలన వాటినుండి మంచి ఉపశమనం పొందుతారు.
2. నివారించే గుణం:
ఎప్పుడైతే మీరు చెవిలో వెల్లుల్లి ఉంచుకోవడం వలన, క్రమంగా మీ లోపలి శరీరం వేడి పెరుగుతూ, వాపులు, తలనొప్పి,జ్వరం మరియు చెవినొప్పులను దూరం చేస్తుంది.
3. చెవినొప్పి వదిలించుకోవడంలో సహాయపడుతుంది:
చెవినొప్పితో ఒకటే బాధను అనుభవిస్తున్న వారు ఒక వెల్లుల్లి పాయను రాత్రి పడుకునేముందు చెవిలో పెట్టుకుంటే, ఉదయం నిద్రలేచే సమయానికి ఆ నొప్పి మటుమాయం అవుతుంది.
4. సహజ దగ్గు మందుగా:
దగ్గుతో బాధపడుతున్న వారు, వెల్లుల్లిని దంచి ముద్దగా చేసుకొని, ఆ వెల్లుల్లి ముద్ద మరియు తేనెను రెండు గంటలకొకసారి తీసుకోవడం వలన దగ్గు దూరమవుతుంది మరియు ఎంతో హాయిగా ఉంటుంది.
5. గుండెకు సంరక్షణగా:
రక్తప్రసరణ బాగా జరగడానికి కొవ్వును తొలగించడానికి వెల్లుల్లి దోహదపడుతుంది. గుండె బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.హృదయ సంబంధిత రోగాలతో బాధపడతున్న వారు ప్రతిరోజూ ఉదయాన్నే 1 లేదా 2 వెల్లుల్లి పాయలుతీసుకోవడం మంచిది.
6. రక్తపోటును నియంత్రిస్తుంది:
శుద్ధమైన రక్తాన్ని సున్నితమైన రక్తప్రవాహం జరగడానికి వెల్లుల్లి దోహదపడుతుంది. అలాగే అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినాలి.
7. అంటువ్యాధుల నుండి పోరాడుతుంది:
తామర, దురదలతో బాధపడేవారు, పాదాల పగుల్లతో బాధపడేవారు వెల్లుల్లి ముద్దను లేదా వెల్లుల్లి నూనెను ఆ స్థానాలలో రాయడం వలన ఆ అంటువ్యాధులు దూరమై మీకు ఉపశామనాన్ని కలిగిస్తాయి.
8. కీళ్ళనొప్పులను తగ్గిస్తాయి:
మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న వారు ఉదయాన్నే వెల్లుల్లి తీసుకోవడం మంచిది. వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్ (ప్రతిక్షకారిని) మరియు శోధనిరోధక గుణాలు కలిగి ఉండటం వలన అటువంటి నొప్పులను వెంటనే నయం చేస్తుంది.
9. అలర్జీలను దూరం చేస్తుంది:
జలుబు, దగ్గుతో చిరాకు చెందేవారు వెల్లుల్లి తీసుకోవడం వలన ఉపశమనం పొందుతారు. చిన్న చిన్న గుల్లలు, దెబ్బ తగిలిన చోటు, దోమకాటు, మరియు దురద కలిగిన ప్రాంతాలలో వెల్లుల్లి రాయడం వలన మంచిది.
10. పంటినొప్పి నుండి ఉపశమనం:
యాంటీ బ్యాక్టీరియా మరియు బాధరహిత గుణాలు వెల్లుల్లిలో ఉండటం వలన పంటినొప్పితో బాధపడేవారు వెల్లుల్లిని తీసుకుంటే ఆ బాధ నుండి విముక్తి పొందవచ్చు. వెల్లుల్లి పాయను లేదా వెల్లుల్లి రసాన్ని ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో అక్కడ రాయడం వలన త్వరగా ఉపశమనం పొందవచ్చు.
The post మీ చెవిలో వెల్లుల్లిని పెట్టుకొని చూడండి..అద్భుతమైన ఫలితాలు వస్తాయి, అవేంటో తెలుసుకోండి. appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2WeWx63



No comments:
Post a Comment