etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, May 1, 2019

అద్భుత ఘడియల్లో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం ? ముహుర్తం ఫిక్స్ చేసిన జ్యోతిష్యులు

ఏపీ సార్వత్రిక సమరం ముగిసిన విషయం తెలిసిందే. ఇక ఎన్నికల ఫలితాలపైనే అందిరి చూపు. ఫలితాలు లెక్కించడానికి 20రోజులకు పైగా సమయం ఉంది. ఏపీలో ఎవరు విజయకేతనం ఎగువేస్తారో ఏమో కానీ జ్యోతిష్యులు మాత్రం ఇప్పటికే ఎవరికి వారే లెక్కలు వేస్తున్నారు. ఏపీ సార్వత్రిక సమరంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని చెబుతుంటే మరికొందరూ టీడీపీ అధినేత నారా చంద్రబాబే ఏపీలో మరోసారి పసుపు జెండా రేపరేపడిస్తారని చెబుతున్నారు. కాగా ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లా పార్వతీపురం శ్రీవిద్యా సర్వమంగళాదేవీ పీఠానికి చెందిన జ్యోతిష్యులు మురపారక కాళిదాసు శర్మ మాత్రం ఎట్టకేలకు ఏపీకి కాబోయే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డేనని ముహుర్తం కూడా ఫిక్స్ చేశారు.

మే26తేదీన ఉదయం 9:29 నిమిషాలకు మంచి ఘడియలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తే ఇక తిరుగుండదంటున్నారు జ్యోతిష్యులు మురపారక కాళిదాసు శర్మ. కాగా జగన్ జన్మనక్షత్రం రోహిణి అని. వైసీపీ ఆవిర్భావ దినం ఆరుద్ర నక్షత్రాల కలయికతో అద్భుతమైన ముహర్తం అని శర్మ చెబుతున్నారు. గతంలో తెలంగాణలో గూలాబీ అధినేత కేసీఆర్, టీఆర్ఎస్ గెలుస్తారని తానే ముందు చెప్పానన్నారు. దేవనాడీ కాలచక్ర గ్రహ గ్రతుల్ని అనుసరించి కచ్చితమైన జ్యోతిష్యం చెప్పమాని తెలిపారు. అందుకే ఇప్పుడు ఏపీలో కూడా వైఎస్ జగనే గెలుస్తారని అంటున్నారు శర్మ. మరి శర్మ గారి జ్యోతిష్యం నిజమని తేలాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిక తప్పదు.

The post అద్భుత ఘడియల్లో సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం ? ముహుర్తం ఫిక్స్ చేసిన జ్యోతిష్యులు appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2PEhGR5

No comments:

Post a Comment