మనిషికి ఉండాల్సింది మానవత్వమే కానీ మతతత్వం కాదని నిరూపించాడు ఓ ముస్లిం క్యాబ్ డ్రైవర్.ఓ హిందూ గర్భిణినీని కాపాడేందుకు కర్ఫ్యూని సైతం లెక్క చేయకుండా హాస్పిటల్ కు తీసుకెళ్లిన ముస్లిం డ్రైవర్ కు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.అస్సాంలో ఈ ఘటన జరిగింది. స్థానిక అల్లర్ల కారణంగా నాలుగు రోజుల క్రితం దక్షిణ అస్సాంలోని హైలకండి జిల్లాలో స్ట్రిక్ట్ పోలీస్ కర్ఫ్యూ విధించబడింది.అల్లర్ల కారణంగా ఆ ఫ్రాంతంలో ప్రాపర్టీస్ డ్యామేజ్ అయ్యాయి.పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.
ఈ సమయంలో రాజ్యేశ్వర్ పూర్ గ్రామంలో నివసించే నందిత అనే గర్భిణీకి పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త రుబాన్ దాస్ అంబులెన్స్ కి ఫోన్ చేశాడు.అయితే కర్ఫూని బ్రేక్ చేసి అక్కడికి వచ్చేందుకు ఏ ఒక్క డ్రైవర్ ముందుకి రాలేదు.అయితే మరోవైపు నందితకు పురిటి నొప్పులు ఎక్కువయ్యాయి.దీంతో 10కిలోమీటర్ల దూరంలోని హాస్పిటల్ కు తన భార్యను తీసుకెళ్లేందుకు సాయం కోసం కంటిన్యూగా రుబాన్ ఇరుగుపొరుగువారికి,రైడ్ సర్వీసెస్ కు కాల్ చేస్తూనే ఉన్నాడు.కామన్ ఫ్రెండ్ ద్వారా విషయం తెలుసుకున్న మఖ్భూల్ హుస్సేన్ లస్కర్(32)అనే క్యాబ్ డ్రైవర్ ఆ గర్భిణినీ హాస్పిటల్ కు తీసుకెళ్లేందుకు ముందుకొచ్చాడు.
వెంటనే రుబాన్ ఇంటికి వెళ్లి తన కారులో నందితను కర్ఫూని బ్రేక్ చేసి మరీ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.హాస్పిటల్ కు చేరుకున్న కొద్ది సేపటికే నందిత మగ బిడ్డకు జన్మనిచ్చింది.ఆ బిడ్డకు శాంతి అని పేరు పెట్టారు.అయితే తన లైఫ్ ని రిస్క్ లో పెట్టి మరీ తమకు సాయం చేసేందుకు ముందుకొచ్చిన లస్కర్ కు హిందూ దంపతులు ధన్యవాదాలు చెప్పారు.తమకు సాయం చేసేందుకు దేవుడే లస్కర్ ను పంపించాడని ఆ దంపతులు తెలిపారు.విషయం తెలుసుకున్న హైలకండి డిప్యూటీ కమిషనర్ కీతి జలిల్ లస్కర్,హిందూ దంపతులను కలిశారు.లస్కర్ ను అభినందించారు.హిందూ,ముస్లిం ఐక్యతకు ఈ ఘటన ఒక ప్రేరణగా ఉంటుందని ఆమె తెలిపారు.
The post ప్రాణాలకు తెగించి…హిందూ గర్భిణినీ హాస్పిటల్ కు తీసుకెళ్లిన ముస్లిం డ్రైవర్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA http://bit.ly/2w4qw1x


No comments:
Post a Comment