etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 17, 2019

అమ్మలో గొడవపడ్డ సమంత, దేనికోసమో తెలుసా …?

సమంతకు తన తల్లితో మనస్పర్థలా? ఇలాంటి ప్రచారమే ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. టాలీవుడ్‌లో దూసుకుపోతున్న సమంత చెన్నై చిన్నదన్నవిషయం తెలిసిందే. అయితే హీరో నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకున్న తరువాత భర్తతో పాటు హైదరాబాద్‌లో సెటిలయిపోయింది. ప్రస్తుతం వరుస విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న సమంతకు మరింత ఆనందకరమైన విషయం తన భర్త నాగచైతన్యతో కలిసి నటించిన మజిలీ చిత్రం మంచి విజయాన్ని అందుకోవడం. ఇకపోతే హీరోయిన్ల గురించి ఏదో ఒక ప్రచారం జరగడం సర్వసాధారణం.

అదేవిధంగా ఇప్పుడు నటి సమంత గురించి ఒక వదంతి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. సమంతకు తన తల్లికి మధ్య మనస్పర్థలు తలెత్తాయన్నదే ఆ ప్రచారం. సాధారణంగా వదంతుల గురించి పెద్దగా స్పందించని సమంత ఈ విషయంలో మాత్రం వేగంగా స్పందించింది. ఎంతైనా అమ్మ కదా.. ఇలాంటి వదంతులకు అడ్డుకట్ట వేయకపోతే, ఇంకా చిలువలు పలువలు అల్లుతారని భావించిందో ఏమో. తల్లితో తన అనుబంధం గురించి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో సమంత పేర్కొంటూ తన తల్లి ప్రార్థనలో మ్యాజిక్‌ ఉందని తాను నమ్మానని, ఇప్పటికీ నమ్మతున్నానని అంది.

చిన్నతనంలో లానే ఇప్పటికీ తనకోసం ప్రార్థన చేయమని అమ్మను కోరతానని చెప్పింది. అమ్మ ప్రార్థన చేస్తే అంతా సరి అయిపోతుందని తెలిపింది. ఇక్కడ ప్రత్యేకం ఏమిటంటే అమ్మ తన కోసం ఎప్పుడూ ప్రార్థన చేసుకోలేదని చెప్పింది. దైవం స్థానంలో ఉండేది అమ్మేనని సమంత పేర్కొంది. దీంతో పాటు సమంత తన తల్లి ఫొటోనూ ఇన్‌స్ట్ర్రాగామ్‌లో పోస్ట్‌ చేసి తన ప్రేమను మరోసారి చాటు కోవడంతో పాటు, వదంతులు ప్రచారం చేసేవారికి తగన బదులు ఇచ్చింది. దటీజ్‌ సమంత. ఈ బ్యూటీ ప్రస్తుతం ఓ బేబీ ఎంత చక్కగున్నావే చిత్రంలో నటిస్తోంది.

The post అమ్మలో గొడవపడ్డ సమంత, దేనికోసమో తెలుసా …? appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2WOFpRD

No comments:

Post a Comment