etechlooks

Daily Latest news Channel

Breaking

Friday, May 3, 2019

www.etechlooks.in

చౌకీదార్ చోర్ హై అంటూ చిన్నారుల నినాదాలు .. వారించిన ప్రియాంక .. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు | Child rights commission issues notice to Priyanka Gandhi for video of children shouting ‘abusive’ slogan ప్రియాంక ముందు చౌకీదార్ చోర్ హై అని నినాదాలు చేసిన చిన్నారులు .. తప్పని చెప్పిన ప్రియాంక అమేధీలో ప్రియాంకా గాంధీ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారంలో కనిపించిన కొందరు చిన్నారులు ‘చౌకీదార్ చోర్ హై’ అని గట్టిగా నినాదాలు చేశారు . అయితే అది చూసిన ప్రియాంక వెంటనే వారి వద్దకు వెళ్లి అలా అనడం తప్పని వారిని వారించారు. మంచి మాటలు మాత్రమే మాట్లాడాలని, పిల్లలు ఇలాంటి విషయాలు మాట్లాడకూడదంటూ వారి వద్దకు వెళ్లి హితవు పలికారు. చిన్నారుల ప్రధాని వ్యతిరేఖ నినాదాల వీడియో వైరల్ .. బీజేపీ ఫైర్ అయితే ప్రియాంక ముందు చిన్నారులు ప్రధానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. పిల్లలకు కాంగ్రెస్ నేర్పించే భాష ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మృతీ ఇరాని ఈ వీడియో గా ఘాటుగా ట్వీట్ చేశారు. సీరియస్ అయిన జాతీయ బాలల హక్కుల సంఘం .. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో చూసిన జాతీయ బాలల హక్కుల సంఘం ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది .ఎన్‌సీపీఆర్‌సీ ఈ వ్యవహారంలో ప్రియాంకా గాంధీకి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలోకి పిల్లలను తీసుకురావడమేంటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక చిన్నారుల నినాదాలపై , ఎన్నికల ప్రచారంలో చిన్నారులను తీసుకురావటంపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిల్లల పేర్లు, పూర్తి వివరాలు, ఘటన ఎక్కడ జరిగిందీ అన్ని విషయాలు సమగ్రంగా తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఎన్నికల సంఘం దృష్టికి కూడా జాతీయ బాలల హక్కుల సంఘం ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లింది. The post చౌకీదార్ చోర్ హై అంటూ చిన్నారుల నినాదాలు .. వారించిన ప్రియాంక .. 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు | Child rights commission issues notice to Priyanka Gandhi for video of children shouting ‘abusive’ slogan appeared first on Etechlooks. http://bit.ly/2IX7hzy

No comments:

Post a Comment