జబర్దస్త్ కమెడియన్ వినోద్ పై దాడి జరిగింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్టేషన్ పరిదిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. జబర్ధస్త్ కమెడియన్ వినోద్.. కాచిగూడలో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. ఇందుకు గాను 10 లక్షల రూపాయలను అడ్వాన్స్ గా ఆ ఇంటి ఓనర్ కు ఇచ్చానని చెప్పాడు. అయితే 30 గజాల స్థలంలో గోడ నిర్మాణం విషయంలో ఇళ్లు అమ్ముతున్న అతనికి తనకు గొడవ జరిగిందని అన్నాడు. దీంతో బాలాజీ, ప్రమీల, సాయి చందర్ లు తనపై దాడి చేసినట్లు గా పోలీసులకు ఫిర్యాదు చేశాడు వినోద్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వినోద్ జబర్ధస్త్ షో లోని చంద్ర టీంలో ఫిమేల్ రోల్స్ చేస్తుంటాడు. ఇంటి ఓనరే తనపై దాడి చేశారని జబర్దస్త్ వినోద్ ఆరోపించారు. కావాలనే తనను ఇంటిపైకి పిలిపించి కొందరితో కలిసి మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇల్లు కొనగోలు విషయంలో ఈ వివాదం తలెత్తిందని పేర్కొన్నారు. గతంలో ఇల్లు కొనగోలు కోసం ప్రమిల, బాలాజీకు రూ.10లక్షలు ఇచ్చామని, వాళ్లు ఇల్లు రిజిస్ట్రేషన్ చేయకుండా, డబ్బులు వెనక్కి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. సెటిల్మెంట్ చేసుకుందామని రమ్మని హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడిలో తీవ్రగాయాలపాలైన వినోద్.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
The post 10లక్షలు కోసం ఆయనే నాపై దాడి చేసాడు : జబర్దస్త్ వినోద్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Z6BgJI
No comments:
Post a Comment