ప్రపంచకప్ సెమీస్‌లో టీమిండియా ఓటమి తర్వాత ధోని స్ట్రైక్‌రేట్, స్లోబ్యాటింగ్ చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే ఎమ్మెస్కే మాత్రం స్ట్రైక్‌రేట్ గురించి తాము ఆలోచించడం లేదని, భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని యువ ఆటగాళ్లను సిద్ధం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నామన్నారు. రిషభ్ పంత్ మూడు ఫార్మాట్లు ఆడుతాడని, అతనిపై పనిభారం పడకుండా చూసుకుంటామని, వృద్ధిమాన్ సాహా, కేఎస్ భరత్‌లను ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తామన్నారు. రాబోయే రెండు నెలలు ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ)లో పని చేయాలని భావించిన ధోని.. విండీస్ పర్యటన నుంచి స్వయంగా తప్పుకున్న విషయం తెలిసిందే.
టీమిండియా లెజండరీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలో తెలుసని భారత ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నారు. అది ధోని వ్యక్తిగత నిర్ణయమని అతని రిటైర్మెంట్‌పై వస్తున్న ఉహాగానాల నేపథ్యంలో పేర్కొన్నారు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్టును ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ.. ‘ ఎంఎస్ ధోని విండీస్ పర్యటనకు అందుబాటులో ఉండటం లేదు. అతని గైర్హాజరీ విషయాన్ని ముందే తెలియజేశాడు. ప్రపంచకప్ నుంచే మా దగ్గర ప్రణాళికలున్నాయి. కానీ ప్రపంచకప్‌లో కొన్ని వ్యూహాలు ఫలించలేదు. రిషబ్ పంత్‌కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని మేం భావిస్తున్నాం. ప్రస్తుతం మా ప్రణాళిక కూడా అదే. ధోని భవిష్యత్తు గురించి కూడా అతనితో చర్చించాం. రిటైర్మెంట్ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. దిగ్గజ క్రికెటర్ ధోనికి ఎప్పుడు రిటైర్ అవ్వాలనే విషయం తెలుసు. కానీ మేం మా భవిష్యత్తు ప్రణాళికలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటాం.’ అని ఎమ్మెస్కే స్పష్టం చేశాడు.
టీమిండియా వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతానికి రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని తెలుస్తోంది. వచ్చే నెలలో జరిగే వెస్టిండీస్ పర్యటనకు మాత్రం ధోని ఉండాలనుకుంటున్నాడని బీసీసీఐ ఉన్నతాధికారి జాతీయ వార్త సంస్థతో పేర్కొన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. లెప్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్న ధోనీ రాబోయే రెండు నెలలు తన పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేస్తాడని అధికారి స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఎప్పుడో ధోనీ తీసుకున్నాడని అందుకే విండీస్ పర్యటనకు దూరంగా ఉంటున్నాడని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కెప్టెన్ కోహ్లీతో, సెలెక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్‌కు అధికారి తెలియజేసినట్లు సమాచారం. ధోనీ స్థానంలో రిషభ్‌పంత్‌కు వికెట్‌కీపింగ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
The post ఎప్పటికైనా ధోని స్థానం అతనికే : ఎమ్మెస్కే ప్రసాద్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2YZvwl3
No comments:
Post a Comment