మండపేటలోని విజయలక్ష్మీనగర్ లో సోమవారం రాత్రి జషిత్ ను ఎత్తుకెళ్లారు కిడ్నాపర్లు. నానమ్మ పార్వతిపై దాడి చేసి బైక్ పై తీసుకెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కిడ్నాప్ కేసును చేధించేందుకు ఎస్పీ నయీం అస్మీ రంగంలోకి దిగారు. బాలుడి ఆచూకీ కోసం ఏకంగా 17 బృందాలు రంగంలో దిగాయి. మరోవైపు మీడియా, సోషల్ మీడియాలో జషిత్ ఫోటోలతో కిడ్నాప్ కేసుపై విపరీత ప్రచారం కల్పించాయి. దీంతో భయపడిపోయిన కిడ్నాపర్లు జషిత్ ను ఈ ఉదయం కుతుకులూరు దగ్గర వదిలేసి పారిపోయారు.
ఏపీలో కలకలం రేపిన బాలుడు జషిత్ కథ కిడ్నాప్ సుఖాంతమైంది. సోమవారం రాత్రి ఇంటి వద్దే నాయనమ్మ పార్వతిపై దాడి చేసి జషిత్‌ను దుండగులు కిడ్నాప్ చేశారు. నేటి ఉదయం కిడ్నాపర్ల బారి నుంచి జషిత్ క్షేమంగా బయటపడ్డాడు. కుతుకులూరు రోడ్డులో జషిత్‌ను కిడ్నాపర్లు వదిలివెళ్లారు. బాలుడిని గమనించిన కూలీలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే తన కిడ్నాప్ గురించి జషిత్ ఏం చెప్పాడంటే.. ‘‘నిన్న నేను తాతయ్య దగ్గర ఉన్నాను. ఏదో ఊరి దగ్గర ఉన్నాను. అక్కడ వేరే వాళ్లెవరో నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్లలో ఒకబ్బాయి పేరు రాజు. వాళ్ల అత్తాళ్లింటికి తీసుకెళతామని చెప్పారు. వాళ్లు రోజూ నాకు ఇడ్లీయే పెట్టారు. ఆ తరువాత నన్ను తీసుకెళతామని ఒకబ్బాయి వాళ్లింట్లో వదిలేశారు. రాజు అని చెప్పా కదా ఆ అబ్బాయే నన్ను బైక్ మీద దింపేశాడు. ఒక చిన్న పిల్లోడు వస్తున్నాడని నేను కాసేపుంటే కారులో వచ్చేశా. వాళ్లు ఇడ్లీ పెట్టి
The post కిడ్నాపర్ల గురించి జషిత్ ఏం చెప్పాడో తెలుసా ….? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Y9DMCR
No comments:
Post a Comment