కేరళ రాష్ట్రంలోని కొల్లెం నగరానికి చెందిన సునీల్ కుమార్ (38) 2017వ సంవత్సరంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. అనంతరం నిందితుడైన సునీల్ కుమార్ సౌదీ అరేబియాకు పారిపోయాడు. ఈ ఘటన అనంతరం ఆవేదన చెందిన బాధిత బాలికను ప్రభుత్వ బాలికల సదనానికి తరలించగా అక్కడ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనంతరం కొన్ని నెలలకే బాలిక మామయ్య కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అత్యాచారం కేసు కాస్తా పెండింగులోనే ఉండిపోయింది. ఓ బాలికపై మూడునెలలపాటు అత్యాచారం చేసి సౌదీఅరేబియా దేశానికి పారిపోయిన నిందితుడిని స్వదేశానికి పట్టుకువచ్చి కటాకటాల్లోకి నెట్టిన ఐపీఎస్ అధికారిణి అయిన కొల్లం పోలీసు కమిషనర్ మేరిన్ జోసెఫ్ అందరి ప్రశంసలందుకున్నారు.
కేరళ రాష్ట్రంలోని కొల్లెం నగరానికి చెందిన సునీల్ కుమార్ (38) 2017వ సంవత్సరంలో 13 ఏళ్ల బాలికపై మూడు నెలల పాటు అత్యాచారం చేశాడు. అనంతరం నిందితుడైన సునీల్ కుమార్ సౌదీ అరేబియాకు పారిపోయాడు. ఈ ఘటన అనంతరం ఆవేదన చెందిన బాధిత బాలికను ప్రభుత్వ బాలికల సదనానికి తరలించగా అక్కడ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నిందితుడిని బాలికకు పరిచయం చేసిన బాబాయ్ తానే ఈ ఘటనకు కారణమనే ఆవేదనతో అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అత్యాచారం కేసు కాస్తా పెండింగులోనే ఉండిపోయింది. నిందితుడైన సునీల్ కుమార్ సౌదీఅరేబియాలో ఉంటూ టైల్స్ పని చేస్తుండటంతో అతన్ని పట్టుకోవడం పోలీసులకు ప్రశ్నార్థకంగా మారింది.దీంతో కేసు కాస్తా పెండింగులోనే ఉండి పోయింది.
కొల్లం పోలీసు కమిషనరుగా కొత్తగా వచ్చిన ఐపీఎస్ అధికారిణి మేరిన్ జోసెఫ్ ఈ పెండింగు చూసి స్పందించి దీనిపై దర్యాప్తును వేగిరం చేశారు. నిందితుడు సౌదీ అరేబియాలో ఉండటంతో సీబీఐ ద్వార ఆ దేశానికి లేఖ రాయించారు. మేరిన్ జోసెఫ్ రియాద్ వెళ్లి ఇంటర్‌పోల్, భారత రాయబార కార్యాలయాలకు సమాచారం అందించి సౌదీ పోలీసుల సాయంతో నిందితుడైన సునీల్ కుమార్ ను అరెస్టు చేసి స్వదేశానికి తీసుకువచ్చారు. సునీల్ కుమార్ ను కటాకటాల్లో నెట్టిన ఐపీఎస్ అధికారిణి మేరిన్ జోసెఫ్ ను శెభాష్ అని అందరూ ప్రశంసించారు.అత్యాచారం కేసులో బాధితురాలు మరణించినా, నిందితుడు విదేశాల్లో ఉన్నా, అతన్ని అరెస్టు చేసిన ఘటన కేరళలో చర్చనీయాంశంగా మారింది.
The post చిన్నారిని అత్యాచారం చేసి సౌదీఅరేబియా పారిపోయిన నిందితుడిని మనదేశానికి పటుకోచ్చిన : ఐపీఎస్ అధికారిణి మేరిన్ జోసెఫ్ appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Lws12o
No comments:
Post a Comment