నోటిశుభ్రత అన్నది పసితనం నుంచే ప్రారంభం కావాలి. ఆరునెలల వయసు నుండి ఆరేళ్ల వయసు మధ్య.. అంటే పాలపళ్ల వయసులో. పిల్లల నోటి శుభ్రత, ఆ పాలపళ్ల సంరక్షణ చర్యలు తీసుకోవాల్సింది తల్లిదండ్రులే. పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత ప్రతిసారీ నీటితో గానీ, దూదితోగానీ చిగుళ్లను సున్నితంగా తుడుస్తూ పసినోటిని శుభ్రంగా ఉంచాలి. చాలాసార్లు రాత్రిపూట నిద్రలో పసిపిల్లలు ఏడిస్తే పాలసీసా నోట్లో పెట్టేస్తుంటారు. అది అలాగే ఉండిపోతుంది. తర్వాత నోరు శుభ్రం చెయ్యరు. దాంతో చిగుళ్లు, పాలపళ్లు దెబ్బతిని దెబ్బతిని శాశ్వత దంతాలు వచ్చే నాటికే నోట్లో పళ్లన్నీ పుచ్చిపోయి ఉంటాయి. నేటి తరుణంలో నోటి దుర్వాసన సమస్య చాలా మందిని ఇబ్బందులు పెడుతున్నది. ఏం తిన్నా తినకపోయినా నోటి దుర్వాసన వస్తుంటుంది. అయితే అందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమి ఉన్నప్పటికీ నోటి దుర్వాసనను పోగొట్టుకోవడం సులభమే. అందుకు కింద చెప్పిన పదార్థాలను భోజనం చేశాక తీసుకోవాలి. దాంతో నోటి దుర్వాసన సమస్యను తగ్గించుకోవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. పెరుగులో ప్రొబయోటిక్స్ అధికంగా ఉంటాయి. ఇవి నోటి దుర్వాసన సమస్యను పోగొడతాయి. భోజనం చివర్లో కచ్చితంగా పెరుగుతో తినడం అలవాటు చేసుకుంటే నోట్లో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. ఫలితంగా నోరు దుర్వాసన రాదు.
2. భోజనం చేశాక 30 నిమిషాల తరువాత గ్రీన్ టీ తాగండి. ఇందులో ఉండే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేస్తాయి. దీంతో నోట్లో ఉండే బాక్టీరియా నశించి నోటి దుర్వాసన తగ్గుతుంది.
3. ఆహారంలో క్యాప్సికమ్, బ్రొకోలిలను భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ సి క్రిములను చంపేస్తుంది. దీంతో నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది.
4. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినాలి. నారింజ, కివీ, స్ట్రాబెర్రీ, పైనాపిల్ వంటి పండ్లను తింటుంటే నోటి దుర్వాసన రాదు. దంత సమస్యలు కూడా పోతాయి. చిగుళ్లు, దంతాలు దృఢంగా మారుతాయి.
5. భోజనం చేశాక ఒకటి రెండు లవంగాలను నోట్లో వేసుకుని చాలా సేపు అలాగే చప్పరించాలి. దీంతో నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. లవంగాల్లో ఉండే పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్లు క్రిములను నాశనం చేసి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.
6. భోజనం చేసిన తరువాత ఒక టీస్పూన్ సోంపు తిన్నా నోటి దుర్వాసన తగ్గిపోతుంది. నోరు రీఫ్రెష్ అవుతుంది.
7. ఒకటి రెండు పుదీనా లేదా తులసి ఆకులను భోజనం చేశాక అలాగే పచ్చిగా నమిలేయాలి. దీంతో నోటి దుర్వాసన సమస్య నుంచి బయట పడవచ్చు.
The post నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా …? అయితే ఈ సింపుల్ ట్రిప్స్ మీకోసమే ..? appeared first on DIVYAMEDIA.
from DIVYAMEDIA https://ift.tt/2Pdzq6n
No comments:
Post a Comment