etechlooks

Daily Latest news Channel

Breaking

Wednesday, April 17, 2019

తమిళనాడులో సీఎం పళనిస్వామి స్వయంగా డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కయ్యారు.

రెండో విడత ఎన్నికలకు ప్రచారం మంగళవారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. రెండో విడతలో 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 97 నియోజకవర్గాల్లో ఈనెల 18న పోలింగ్‌ జరగనుంది. అయితే ప్రచారం ముగిసినప్పటికీ డబ్బులు పంపకం మాత్రం ఆగట్లేదు. తమిళనాడులో సీఎం పళనిస్వామి స్వయంగా డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కయ్యారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఆయన పాంప్లెట్లతో పాటూ డబ్బులు కూడా ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పండ్ల దుకాణం వద్ద ఓ మహిళ తమ పార్టీకి ఓటేయాలని అభ్యర్థించగా.. ఆమె అరటిపండ్లు ఇచ్చింది. అనంతరం ఆ మహిళకు పాంప్లెట్‌తో పాటు సీఎం డబ్బులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.

ఇదిలా ఉంటే.. తేని జిల్లా అన్నాడీఎంకే ఆఫీస్‌లో రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకుని.. ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులను కార్యకర్తలు అడ్డుకోవడంతో ఖాకీలు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారు. మరోవైపు తమిళనాడులోని తూత్తుకుడిలో డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ సోదరి.. కనిమొళి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం రాత్రి తూత్తుకుడి లోక్‌సభ పరిధిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

The post తమిళనాడులో సీఎం పళనిస్వామి స్వయంగా డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కయ్యారు. appeared first on DIVYAMEDIA.



from DIVYAMEDIA http://bit.ly/2VNEMqM

No comments:

Post a Comment